Thursday, 14 November 2013

ఉదయ కన్య||సత్యం గడ్డమణుగు||

రాత్రంతా ఏమైపోయావ్..
నన్ను అలా ఒక్కడిని వదిలేసి వెల్తావ్.. 
నువ్వులేని వొంటరి రాత్రిని గడిపేశాక 
మెల్లగా వొచ్చి నిద్రలేపుతావ్.. 
నువ్వేదో నా సెల్లులోని అలారం లాగా 
నిద్రలేపటానికే పుట్టావనుకుంట..

మనిద్దరి ప్రణయ నాదాలను చూసి
కుళ్ళుకున్నారేమో ఆ సూర్య చంద్రులు..

రాత్రివేళ నిన్ను నా కౌగిట చేరనీయకుండా
ఆ చంద్రుడు నిన్ను దాచేస్తున్నాడు కదూ..

నాకంతా తెలుసు..

నన్ను చేరేందుకు నువ్వు పడే ఆరాటం తెలుసు..
నకై నీ తాకిడి చేసే విన్యాసాలు తెలుసు..
నీకు నేనంటే ఎంత పిచ్చో తెలుసు..

నువ్వు ఎలాగొలా ఆ చంద్రుని చెర నుంచి తప్పించుకుని వచ్చి
నిదురిస్తున్న నా మోముని చేతులారా తడిమి
నీ గుండెలపైకి తీసుకున్న క్షణం
ఆ ఒక్క క్షణం, మళ్ళి ఆ సూర్యుడేదో
చంద్రుడికి రైట్ హ్యాండ్ లాగా
గబాల్న వొచ్చేసి నేను కళ్ళు తెరిచి నీ వదన
మోహనాన్ని చూసేలోపు నిన్ను ఎత్తుకుపోతున్నాడు..

రోజూ ఇదే జర్గుతోంది..
మళ్ళీ నిరీక్షణ.. మళ్ళీ ఎదో కొత్త ఆవేదన..
కొన్ని సార్లు నిద్రలేని రాత్రులు నీ కోసం..
కొన్ని సార్లు నిద్రలోకి జారుకుంటా నీ అందాన్ని కలలోనైనా
కూసంత ఎక్కువ సేపు చూడగలనేమో అని..

నేనడక్కుండానే నాకోసం ఉంటావ్..
నన్ను తెలియని ఒక అద్భుత లోకాన
విహరింపజేస్తావ్ నీ వొడిలోకి తీసుకుని..
అదిచాలదా నాకీ జన్మకి..?

-సత్యం గడ్డమణుగు, 14-11-2013, 08:23

Wednesday, 13 November 2013

నన్ను ఇష్టపడాలి అంటే..?

నన్ను ఇష్టపడాలి అంటే నా బిజీ లైఫునీ, మాటలు లేని మూగ భాష్యాన్ని, తీరిక లేని నా పరుగునీ అర్దం చేస్కుని వాటినీ నాతో సమానంగా ప్రేమించటం.. అంతే కానీ, నేను నిన్నే ఇష్టపడతాను, నీ బిజీ గురించి నాకు తెలియదు.. నేను కురిపించిన అనురాగాన్ని అలాగే నువ్వు అందివ్వాలి అని నువ్వు అనుకుంటే నాతో బాంధవ్యం కొనసాగించక ఆగిపోవటమే మంచిది.

- - ఇట్లు నీ నేను  [సత్యం గడ్డమణుగు, 13-11-2013, 20:27]

Monday, 21 October 2013

నీ మౌనం.. నాలొ జ్వాల..

అందని సొంపుల సొగసులదానా..
నీ వంపుల కెంపుల ముంపున 
నను ముంచిన దానా..
నీ పలుకుల కై కులికె ఈ చెలికాడిని 
చేర రావేల..? 

నీ మౌనం నాలొ జ్వాల ను రగిలిస్తొంది..
ఎక్కడ ఆ జ్వాలలో మండిపోతానో అని నీ 
చల్లని చూపుల కోసం ఎదురు చుస్తున్నాను..

- ఇట్లు నీ నేను  (శ్రీ సత్యం గడ్డమణుగు)

నీలా మారిన నా ప్రెమ..

నీలో ప్రేమకై
నాలో ప్రాణమై
నిన్నే చేరిన
నీలా మారిన
నా ప్రెమ..

పరవశంలో ప్రతీ క్షణం
గడిపేస్తున్నా..
నువ్వు నా యద చేరిన ఈ క్షణం
చాలు ఇక ఈ జీవితం..

- ఇట్లు నీ నేను  (సత్యం జి)

Photo: నీలో ప్రేమకై 
నాలో ప్రాణమై 
నిన్నే చేరిన
నీలా మారిన 
నా ప్రెమ..

పరవశంలో ప్రతీ క్షణం 
గడిపేస్తున్నా..
నువ్వు నా యద చేరిన ఈ క్షణం
చాలు ఇక ఈ జీవితం..

- ఇట్లు నీ నేను <3 (సత్యం జి)

Saturday, 19 October 2013

నన్ను చేరుమా..

ప్రియతమా నా మదిలో రూపమా..
నా కన్నుల దీపమా,
నా ఊహల చాపమా,
నెనంటే కోపమా 
నాపై దయగనుమా..
ప్రెమతో నన్ను చేరుమా..

- ఇట్లు నీ నేను  (శ్రీ సత్యం గడ్డమణుగు)

ఊపిరాడక ఒరిగిపోతానేమో

నువ్వేదో నావలా నదికె పరిమితం అనుకున్నా..
తోడొచ్చే నీడలా మరుతావనుకోలేదు..
అసలు బంధమే ఒద్దనుకునే నాకు నీ స్నేహాన్ని ఎరగా వేశావ్..
ఇప్పుడేమో ఒక్కసారిగా ఆ స్నేహ సముద్రంలో 
ఒంటరిగా వదిలి వెల్తే ఊపిరాడక ఒరిగిపోతానేమోనని భయంగా ఉంది ప్రియతమా..
ప్లీజ్ వదిలి వెళ్ళకు నన్ను...

- ఇట్లు నీ నేను  (శ్రీ సత్యం గడ్డమణుగు)

Monday, 26 August 2013

మత్తెక్కించి చిత్తు చేస్తోంది..

నీ మేని పరిమళం మత్తెక్కించి చిత్తు చేస్తోంది..
అదలా కనుగీటి కవ్విస్తుంటే నను 
కాటేయ్యకుండా ఏలా ఆగమంటావ్..?
- ఇట్లు నీ నేను  (శ్రీ సత్యం గడ్డమణుగు)

Saturday, 16 March 2013

నా మాట విననంటోంది..!


నీ అందమైన అధరాల 
అమృతాన్ని తాగుదాం అనుకున్నా..

నీ ఎత్తైన ఎదల లోతెంతో
ఒక్కసారి దూకి లెక్కిద్దాం అనుకున్నా..

నీ నడుము మడతలలో
మంటలు రేపి మత్తెక్కిద్దాం అనుకున్నా..

ఇక ఆ తరువాత

నీలో నేనైపోయి

ఎన్నో ఎన్నెన్నో జలపాతాలను
ఒక్కటి చేసి ఒక అంతులేని
సంద్రపు సుడులు సృష్టిద్దాం అనుకున్నా..

చివరికి

నీ పాదాలపై నా పాదాలతో
తెలియని స్టెప్పులతో నాట్యం చేద్దాం అనుకున్నా..

ఎన్ని అనుకున్నా తీరవనీ,

తీరవని తెలిసీ,

తెలిసీ తెలియని నా చిన్నారి
మనసుని బుజ్జగించాలనుకున్నా..

అందుకేనేమో బతిమాలలేక
గద్దించి ఐనా దాన్ని మళ్ళించాలని చూశాను..

కానీ

నీ అంతులేని అందాలను అందుకోవాలంటూ,
నా మనసు నా మాట విననంటోంది..!

- ఇట్లు.., ```నీ నేను```
(సత్యం గడ్డమణుగు), 1 6- 0 3- 2 0 1 3, 7 p m

Friday, 1 March 2013

మనసా మాట వినవే..


ఓ మనసా 
దయచేసి నా మాట వినవే..

తనను నీతో మాట్లాడదు.. 
నిన్ను పట్టించుకోదు..
అయినా ఎందుకు చెప్పు
ఇంకా తన గురించె ఆలోచిస్తావ్..

అమాంతం అంతెత్తునుంచి
పడుతున్న నీళ్ళ వల్ల
కింద ఉన్న ఈ రాయికి తగులుతున్న
గాయాలు ఎవరికీ
కనిపించవు.. కేవలం
వాళ్ళకు కావలసింది పురివిప్పిన
జలపాతమనే మయూరి అందాలు..

ఎవరో వచ్చి ఓదారుస్తారు
ఈ గుండెని అనే పిచ్చి ఆలోచనని ఎప్పటికైనా
నువ్వు ఒంటరివాడివే అన్న
నిజంతో చెరిపెయ్..

- Satyam Gaddamanugu, 1-3-2013,22:23pm

Thursday, 28 February 2013

పొగరు

అవునూ.. నాక్కొంచెం పొగరెక్కువే..

నీకోసం ప్రతీ క్షణం పరితపిస్తూ
నీతొ మాట్లాడాలని తహతహలాడే
ఈ హృదయాన్ని నీవు పట్టించుకోకుండా
వదిలేసినప్పుడు, ప్రతి రోజూ నీతో మాట్లాడే
మనసుని ఒక్కసారిగా ఉత్సాహంగా
పరుగులు తీస్తున్న నదికి ఇసుక బస్తాల
ఆనకట్ట.. కాదు కాదు అడ్డుకట్ట వేసినప్పుడు

పోనీలే నీకు కూడా నేను తగనేమో
అని తలపుల తలుపులు మూసేసి
తలకింద దిండు పెట్టుకుని హాయిగా
పడుకుందామంటే, ఏదీ నిదుర రాదే..
నీ ఆలోచనలే.. కనురెప్పలు మూయటమే ఆలస్యం
నా కళ్లముందు ప్రత్యక్షమవుతోంది నీ రూపం..
సరే కదా అని మళ్ళీ లేచి

ఫోను బుక్కులో నీ నెంబరు చూసి
డయలు చేశాను.. అప్పుడు నా ఫోను స్క్రీను
నన్ను వెక్కిరింతగా చూస్తోంది.. ఎన్ని సార్లు
చేస్తావ్ రా తనెలాగు ఎత్తదు.. పిచ్చోడా.. అని..
అయినా సరే దాని నోరు మూసి నీ నోటి మాటకై
ఫోను చేస్తే పాపం నీ ఫోను నువ్వు గొంతు నొక్కేసిన సంగతి
నాకు గుర్తురాలేదు.. పాపం అయినా నీ ఫోను నాకోసం
ఆ మూగ గొంతుతో కూడా అరుస్తూనే ఉంది..
నువ్వే పట్టించుకోలేదు..

అందుకే అలిగాను.. నీకేమైంది అని అడిగాను..

నిజమే నాక్కొంచెం పొగరెక్కువే
మండుటెండలలో చల్లటి చెట్టునీడ లాంటిది నీ
స్నేహం అనుకున్నను కదా అందుకు..
మంచు తెన్నెల్లో వె్న్నెల లాంటిది నీ
సాంగత్యం అనుకున్నాను కదా అందుకు..

- Satyam Gaddamanugu, 28-02-2013, 14:37pm

Sunday, 13 January 2013

ప్రేమ ఒక వ్యసనమే ప్రియతమా..


ప్రేమ ఒక వ్యసనమే ప్రియతమా..
నువ్వు నా పక్కన లేనప్పుడు అనుక్షణం
నీ సరసాలు గుర్తు తెచ్చి నాలో నెను ఉన్నాననే
నిజాన్ని మర్చిపోయేలా చేస్తుంది మరీ..

ప్రేమ ఒక వ్యసనమే ప్రియతమా..
ఎన్నో చిలిపి తలపుల వలపుల తలుపులు
తెరచి నీకై ఎదురుచూపులు చూస్తున్న నా
మనసుకి నచ్చచెప్పలేకపోతున్నప్పుడు..

ప్రేమ ఒక వ్యసనమే ప్రియతమా..
ప్రపంచమ్లో నేనే అందగత్తెని అని నేను గర్వంగా
మనసులో ఆనందపడటానికి కారణం
నువ్వని అనుక్షణం నీ చూపులు గుర్తుచేస్తున్నప్పుడు..

ప్రేమ ఒక వ్యసనమే ప్రియతమా..
అనుకోకుండా మొదటిసారి నీ చేయి నా చేతిని
తాకినప్పుడు ఏదో తెలియని పులకింత
నా యదలో కలిగి నా వొళ్ళు నా వశం తప్పినప్పుడు..

ప్రేమ ఒక వ్యసనమే ప్రియతమా..
ఈనో జన్మల అనురాగాన్ని అంతులేని
అనుబంధాన్ని కేవలం నీ సాంగత్యమ్లో పొందిన నేను
ఇలలో ఇంకెవరికీ దక్కని అద్రుష్టం నాదే అని ఆనందపడేటప్పుడు..

- ఇట్లు నీ నేను (సత్యం గడ్డమణుగు)