చెలియ చూపులు నన్ను తాకిన క్షణమునమనసే మధురిమలు పలుకుతుంటే..చెలియ సొగసులే సరిగమలు పాడే వేలనిండు పున్నమి వెన్నెలల పూల వర్షం కురిపిస్తుంటే...ఎగురుతున్న పక్షులలో నా మనసు నాకూ రెక్కలోచ్చాయంటూ గర్వంగా చెప్పింది..! చేపకు నీరే ప్రపంచంపక్షికి గాలే లోకంఅలాగే నాకు నువ్వే సర్వం...!వందలాది సునామీలే ఒచ్చినా, ఈ ప్రపంచం అంతా మునిగి పోయినా,
నన్ను లేకుండా చేస్తాయేమో కానీ,నా మనసునీ.. నా మనసులోని నీ జ్ఞాపకాలనుకనీసం స్పురించాలేవు ప్రియతమా...
జీవితం లో ప్రతీ ఘటనకీ, ప్రతీ మజిలీకీ ఒక కారణం అంటూ ఉంటుంది. కానీ ఏమిటీ ఈ అనుభందం..?నీతో ఎన్ని గొడవలైనా, ఎన్నిసార్లో అలకలు చిలకలై చిలకలై ఎగిరినా...,కోపాలు, తాపాలు ఎన్ని ఒచ్చినా ఇంకా నిన్ను వీడలేకున్నాను.నువ్వు నన్ను చీదరించుకున్నా, అసహ్యించుకున్నా సరే నిన్ను విడవాలని అనుకున్నా వీడలేకున్నాను... ఎందుకిలా..?ఎన్నిసార్లో నామనసుని కట్టడి చేసినా మళ్ళీ అది నీ వైపే పరుగులు తీస్తోంది.ఏమిటి నాతప్పు..? ఎందుకు నాకీ శిక్ష...?నిన్ను అమితంగా ప్రేమించటమే నా నేరమా..?ప్రతీ క్షణం ఎక్కడ నిన్ను కష్టాల నీడ తాకుతుందో అని తపన పడుతూ..,ఎక్కడ నీవు తప్పటడుగు వేస్తావో అని అనుక్షణం ఆలోచించిన నా మనసుదే తప్పంటావా..?ఎప్పటికీ నేను నీ చేలిమినే నంటూ చేసిన బాసలు ఎటు పోయాయో...అనురాగం లేని నీ చూపులు, ప్రేమలేని నీ పలుకులునన్ను మరింత క్షోభకి గురిచేస్తున్నాయి...ఇక నేను తాళలేను... ఈ నరకం అనుభవించలేను..నీ ప్రేమ లేని జగతిలో జీవించలేను...