Wednesday, 20 August 2014

కష్టాలు తీరాలంటే కష్టపడాలి.. -సత్యం జి సామాన్యుడు కాదు.
ఎంత కాలం పడుతుందో నేనెవరో నాకు తెలియటానికి..? - సత్యం జి సామాన్యుడు కాదు

Monday, 28 July 2014

వదిలెయ్యటానికే వంద కారణాలు కావాలి.. 
కానీ కలిసుండటానికి కారణాలే అక్కర్లెదు..
- సత్యంజి, 28-07-2014, 04:01pm

Monday, 21 July 2014

చేయగలను కానీ, అనటం ఆపి చేతనైతే చేసి చూపించు.. లేదా ____ 
చేసే దమ్ముంటేనే చెప్పు.. లేకపోతే మాట్లాడటం మానెయ్..
- సత్యంజి

Monday, 14 July 2014

ఇదే మా ఇల్లు..


మా ఆనందాలు, బాదలు, కష్టాలు, సుఖాలు
కన్నీళ్ళు, నవ్వులు ఎన్నో చూసింది..
మమ్మల్ని పెంచింది..
మమ్మల్ని చదివించింది..
మమ్మల్ని ఉద్యోగానికి పంపింది..
తిండీ, గుడ్డ ఇచ్చిన ఆ దేవుడికి కూడా ఓ గూడు కావాలి..
మా ఆనంద నిలయం.. మా స్వర్గ సీమ.. మా "శాంతి నివాసం"

ఇదే మా ఇల్లు.. ఎన్నో అనురాగాల పొదరిల్లు..

Thursday, 19 June 2014

నిత్యం నాలో నన్ను నేను కనుగొంటున్నా.. - సత్యం జి సామాన్యుడు కాదు

నేనూ ఏడుస్తా...

నేనూ ఏడుస్తా...
చిన్నపిల్లోడిలా ఎక్కి ఎక్కి ఏడుస్తా..
ఆడపిల్లలా నక్కి నక్కి ఏడుస్తా..
చేపపిల్లలా నీటిలోన ఏడుస్తా..
వర్షంలో చినుకుల్లో కలిపేస్తా
నా కన్నీళ్లని., బాదల్లో
కంటిబావిలో ఇంకేస్తా చెమ్మను నేనే అయి..
కానీ ప్రతీ చుక్కనీ నా కలల కుండీలో
పెరుగుతున్న "భవిష్యత్తు" అనే మొక్కకి పోసి అందంగా పెంచుతా..
- సత్యం జి సామాన్యుడు కాదు

Friday, 13 June 2014

కవితల్తో కవ్వించే కవి కన్నీటి కావ్యం కాంచేదెవరో..?
- సత్యం జి సామాన్యుడు కాదు, 13-06-2014, 08:30
ఇలలో నిన్ను గాంచే ఓ నరుడా, నీలో ఇలను గుర్తించు..
ప్రతీ జీవి ఆనందాలూ నీలోనే అలలై వొచ్చి చేరుతాయి..
- సత్యం జి సామాన్యుడు కాదు

Thursday, 12 June 2014

దేవుడికి లేని కుల మత భేదాలు మనుషులకి ఎందుకు..? - సత్యం జి సామాన్యుడు కాదు

Wednesday, 11 June 2014

నేనే దేవుడిని అనిపిస్తుంది అప్పుడప్పుడూ.. 
మనసూ, ఆలోచన రెండూ ఒకటే అనిపించినప్పుడల్లా.. 
- సత్యం జి సామాన్యుడు కాదు

Tuesday, 10 June 2014

ఏం చెయ్యను చెప్పు మరి..

****************************
నిండు జాబిలికి గాలం వేద్దాం అనుకుంటే
తన వెన్నెలమ్మకి ప్రమోదమైన ప్రేమని 
పంచేందుకు చంద్రుడున్నాడంది..
నా హృదయాన్ని మీటే అనురాగ వీణ
ఆకాశవాణి కి నిచ్చెనేద్దాం అనుకుంటే
ఆ కృష్ణవర్ణం మబ్బుల్తో కమ్మేసింది..
అంతులేని ఆప్యాయతలు పంచే
అనురాగవందినిపై ఆశ పడ్డాను..
చేరనీయకుండా సంగీత మెహరులు
చంటోడిలా తన చెంత చేరాయి..
నన్ను దూరం చేశాయి..
రంజుమనే రమ్యరాగాలను ఆలపించాలని
ఆతృతగా ఎదురుచూశా, కానీ
తెలియని తేజం తనలో నాపై
ద్వేష బీజాలు నాటింది..
వయ్యారాలు పొయే వలపుల వల్లికి
వల వేద్దాం అనుకుంటే వన్నెల వెన్నెల్లో
వయసు సేదతీరేలోపు సరదాగా
సైడైపోయింది సక్కని సిన్నోడితో..
ఆడు సిన్నోడు కాదు నన్ను పక్కకి నెట్తేసిన బుడ్డోడు..
కాదు కాదు ఈ బంగారాన్ని తగిలించుకున్న బండోడు..
- సత్యం జి సామాన్యుడు కాదు

Sunday, 1 June 2014

ఆ బ్రహ్మ వొచ్చి బతిమాలాడు

నీకోసం కవిత రాద్దాం అనుకుంటా..

చేయి కీబోర్డు మీటదాకా వెళ్ళగానే
నువ్వు తప్ప ఇంకేమీ గుర్తురాదు మెదడుకి..
నా వేళ్ళు కీబోర్డు నుంచి నావైపు తిరిగి 
తిడుతూ ఉంటాయ్ ఇంకెంతసేపురా ఆలోచిస్తావ్..
త్వరగా ఏదో ఒకటి చెప్పు టైపు చేస్తా అని..!
కానీ ఎన్నిటైపుల్లో ఆలోచించినా ఒక్కక్షరం కూడా
బయటకు రామంటూ తలుపులేసుకుంటున్నాయి..
కానీ అప్పుడే నీ జ్ఞాపకాలు 
అక్షరాలు రాకపోతేనేం, నీకు మేమున్నాం 
అంటూ అదాటున అల్లేశాయి..
నువ్వు చెప్పిన మాటలన్నిటినీ కట్టిన మూటలు
ఎన్ని ఉన్నాయో అవన్నీ వొంపుకున్నా.. చాలా పెద్ద
కుప్పే అయ్యింది.. ఇంతలో నీకోసం నేను కన్న కలలన్నిటినీ
బధ్రంగా దాచిన దారి కనపడే సరికి వాటిని వెతికి తీసుకొచ్చి
కుప్పగా పోయటానికి ఎన్ని తిప్పలు పడ్డానో..
ఇలా నీ ఊహలు, నీ చేష్టలు, నీ అల్లర్లు, నాతో పంచుకున్న
అనుభవాలూ అన్నిటినీ తెచ్చి కుప్పలుగా పోశా
సరిపోలా ఆ స్థలం..
ఐనా సరే పోస్తూనే ఉన్నా..
ఆఖరుకి చూస్తే, నేను శూన్యంలో ఉన్నా,
ఆ కుప్పల తెప్పలకి
భూమి సరిపోలా..
సౌరకుటుంబం సరిపోలా..
విశ్వం కూడా నిండిపోతుంటే, ఒక్కసారిగా
ఆ బ్రహ్మ వొచ్చి బతిమాలాడు, నువ్విలా విశ్వాన్నంతా నింపేస్తే
నేను పుట్టించే జీవాలకి చోటు లేదంటూ..
అయీనా వినలేదు.. వినలేను..
ఎందుకంటే నాకు తెలిసినంత వరకు
విశ్వంలో ప్రతీ అణువులోనూ నువ్వూ
నీ ప్రేమ తప్ప ఇంకేమీ లేదు మరీ..!
ఇట్లు నీ నేను 
<3  సత్యం జి, 01-06-2014, 22:15

Wednesday, 28 May 2014

నిజమే నేనో బండరాయిని/సత్యం జి/

నేను నేనులో నానాను..
పూర్తిగా నానినా నాలోనీ కోరిక ఇంకా మెత్తబడదేం..
నన్ను బండరాయినని బండబూతులు తిట్టుకుంటున్నావు కాని
నేను నీవుగా అయ్యాక నేను లేని చోట ఉన్నది ఇక నువ్వేగా..
నువ్వు నేనూ మొత్తం నువ్వే
నేను నువ్వు మొత్తంగా నేనే..
అవును బండే.. మామూలు బండ కాదు
చాలా గట్టి బండ.. నేను కాదు నువ్వు కాదు..
నేను అనే నీపై నేను పెంచుకున్న
అపారమైన ప్రేమ.. అది నిజంగానే బండరాయి..
అది కరగదు.. కదలదు..
నన్నూ, అలాగే నాలో ఉన్న నువ్వనే నన్ను కూడా
కదిలిస్తుంది.. అతలాకుతలం చేస్తుంది..
అంత కుదిపేసినా కుదురుగా
కూర్చొని కులాసాలడుగుతుంది
ఇద్దరూ బాగానే ఉన్నారుగా, అంటూ..
ఆ బండ ప్రేమకి నేనంతే ఎంత ప్రేమో..
నా నువ్వంటే, నాలోని నువ్వంటే, నేనైన నువ్వంటే, నువ్వనే నేనంతే ఎంత ప్రేమో..
.
- సత్యం జి, 28-05-2014, 16:52

Saturday, 24 May 2014

నీ మత్తు...నా మతి రేపుతోంది..

ఎంత ప్రయత్నించినా మత్తువీడటంలేదు.. నీ మత్తు వీడటంలేదు..
కళ్ళు బరువెక్కితే పరవాలేదు.. మనసెక్కితేనే మత్తుగుంది..
ఒళ్ళంతా ఒంటరిగా ఒరిగిపోయినా ఓకే కానీ, నిన్ను చూడగానే
నా మనసుకి ఎవరో బలవంతంగా చేయి పట్టుకుని
డ్రగ్స్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు తెగ ఊగుతోంది.. మతి రేపుతోంది..
- ఇట్లు నీ నేను (సత్యం జి) , 24-05-2014, 16:54

Saturday, 19 April 2014

కవ్విస్తోంది నీ కొంటెతనం..

నాలో తెలియని ఉప్పెనలు రేపి
అవి నిను చేరాలనీ
నీలోకి నన్ను చేర్చాలనీ
తహతహలాడుతుంటే 
నీ హృదయ పాతాళంలోకి నన్ను నెట్టేసిన సంగతే మర్చిపోయి
పిలుస్తావేమి ప్రియురాలా..
నీ గుండెల శిఖరాన్ని చేరాలని 
ప్రతీ సారీ ప్రయత్నిస్తూనే 
జారి జలపాతాలలో తడిసి ముద్దైపోతున్నాను..
అవి చేసే సవ్వడికి
సుతిమెత్తని నీ పీఠబూమిపైన
పన్నీటి స్నానం చేద్దామని వొస్తుంటే
చంద్రవంకకి కవల పిల్ల అయి ఉంటుంది నీ నడుము..
అడ్డుగా నిలబడి
ఆడుకోమని ఆర్డరేస్తోంది..
ఆవేశంగా అంచుని తాకిన నాకు
అలుపెరగని నీలో ఉరకలు
అర్దమవుతున్నాయి..
నన్ను చుట్టి కట్టి మట్టుబెట్టే
మాయాజాలంలో మునిగిఫోతున్నానని
తెలిసినా నీ నున్నని నూలుపోగుల
నయగారాలు నాలో లేచిన కోరికల మృగాలతో
తలపడటానికి తయారుగా ఉండటం చూసి
నిశ్శబ్ద విప్లవాలకై
రంగం సిద్దం చేస్తున్నాను...
- ఇట్లు నీ నేను  (సత్యం జి), 19-04-2014, 16:54

Saturday, 29 March 2014

ఏం చేయమంటావ్..?



రాతలే కలిపాయో చేతి రాతలే మలిపాయో నిన్ను నావైపు,
సమాజం మాయమైపోయింది..
మనసు నీ అనురాగపు మంచుతెనెల్లొ తడిసి ముద్దయ్యేందుకు
సిగ్గుపడాలా అని అనుకుంటూనే సిద్దమయ్యింది..
నీ మాటల మత్రంతో రెక్కలొచ్చాయి నా యదగూటికి..
నీకై ఎగిరివస్తోంది..
చేతికైనా చిక్కని ఆ మది భావాల 
అంతిమ గమ్యం నీవేనని తెలిసినా 
నెనెంత ఒద్దని ఆపినా
ఆగని ఆ మధుర మాయ
నువ్వంటే నాకిష్టమనీ,
అలా చెప్పటం తప్పో ఒప్పో తెలియక పోయినా,
నన్ను తప్పుగా తలవద్దనీ వేడుకుంటూ..
మూసిన పెదవుల మాటునుంచి తప్పించుకుని మరీ
ఠపీమని చెప్పేసింది..
ఏం చేయమంటావ్..?
- ఇట్లు నీ నేను  (సత్యం గడ్డమణుగు), 29-03-2014, 19:50

Wednesday, 12 March 2014

కలలోసుందరి

నేను తల ఎత్తి చూశా నాకు తన చెంగు చివర వేళ్ళాడుతున్న ఒక దారం తగులుతోంది..
తన అందం ముందు నేను చిన్నవాడ్నైపోయా..
తను నడుస్తోంది..
దొరుకుతుందో లేదో అని పోకిరీలో మహేష్ లా పరిగెత్తి ఆ దారాన్ని పట్టుకున్నా..
అలా ఆ దారానికి వేళ్ళాడుతూ పైకి ఎకి ఎక్కు తన భుజం మీద నిల్చుని 
ఈలలేస్తున్నా నన్ను చూడమని..
అదేంటో అప్పుడు ఈలలు తప్ప మాటలు రావట్లేదు మరి..
కానీ తను అప్పుడే కాలుకి ఏదో అడ్డుతగిలి పడబోయింది..
ఎక్కడ పడుతుందో అని కంగారు పడుతూ పడిపోకుండా పట్టుకుందాం అని
చేతులు చాచాను.. కాళ్లకింద పడిన తన చీర అంచుని సరిచేసుకునే లోగా
నేను అమాంతం జారి అలా పడిపోతూ లేచాను.. నిదుర లేచాను..!
- ఇట్లు నీ నేను సత్యం గడ్డమణుగు, 12-03-2014, 18:34