ఆహ్లాదకరమైన ప్రకృతి వొడిలో
చుట్టూ రమణీయమైన అందాలు
అలా నన్ను పలకరిస్తుంటే ఎక్కడో దూరంగా నిల్చుని
నన్ను నీ కౌగిలికి ఆహ్వానిస్తుంటే ఒక్కసారిగా
అలారం మోగింది. అప్పుడు అర్దమైంది అదంతా నా కల అని..
ఇలా నా జీవితం కోటి "కల"ల సాగర తీరం లో నీ
ప్రణయ ఆటుపోటుల మద్య కోన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది.
ప్రతి రోజు నీ నవ్వు లో రతనాల మూటలను కట్టుకునే
నేను ఆ నవ్వులు నాకోసం
కావని తెలిసినపుడల్లా క్షణానికి వేయి సార్లు మరణిస్తున్నాను..
ఎన్నో జంటలు ఈరోజు తమ ప్రేమ
ఊసులు చెప్పుకుంటూ, బహుమతులు, రోజాలు ఇలా
లోకాన్ని మరచి తమ ప్రేమాలలో ఎవరికీ వారు
ఒక కొత్త లోకాన్ని నిర్మించుకునే ఈ ప్రేమికుల రోజైనా
ఒక చిన్న మాట మాట్లాడలేని ఈ దౌర్భాగ్యుడు నిమిషానికో
నరకం అనుభవిస్తున్నాడు. నీ స్నేహం తో నా పతీ క్షన్నాన్ని
ఎంతో సుందరం గా మార్చిన నువ్వే ఈనాడు
ఇలా నిర్దాక్షిణ్యం గా ఉంటె
నా సున్నితమైన హృదయం తట్టుకోలేకపోతోంది..
సేకనుకోసారి మృత్యువుతో నువ్వు
మల్లి ఎప్పటికైనా దక్కుతావనే చిన్ని ఆశ అనే ఆయుధం తో
పోరాటం సాగిస్తోంది.

No comments:
Post a Comment