నా హృదయాన్ని మీటే అనురాగ వీణ ఆకాశవాణి కి నిచ్చెనేద్దాం అనుకుంటే ఆ కృష్ణవర్ణం మబ్బుల్తో కమ్మేసింది..
అంతులేని ఆప్యాయతలు పంచే అనురాగవందినిపై ఆశ పడ్డాను.. చేరనీయకుండా సంగీత మెహరులు చంటోడిలా తన చెంత చేరాయి.. నన్ను దూరం చేశాయి..
రంజుమనే రమ్యరాగాలను ఆలపించాలని ఆతృతగా ఎదురుచూశా, కానీ తెలియని తేజం తనలో నాపై ద్వేష బీజాలు నాటింది..
వయ్యారాలు పొయే వలపుల వల్లికి వల వేద్దాం అనుకుంటే వన్నెల వెన్నెల్లో వయసు సేదతీరేలోపు సరదాగా సైడైపోయింది సక్కని సిన్నోడితో.. ఆడు సిన్నోడు కాదు నన్ను పక్కకి నెట్తేసిన బుడ్డోడు.. కాదు కాదు ఈ బంగారాన్ని తగిలించుకున్న బండోడు..